వేసవి ప్రత్యేక రైళ్లు పొడిగింపు

May 19,2024 09:06 #extension, #summer special trains

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : వేసవి కాలంలో ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు 08321 సంబల్‌పూర్‌ – ఎస్‌ఎంవి బెంగళూరు ప్రత్యేక రైలు మే 30 నుంచి జూన్‌ 27 వరకు ప్రతి గురువారం సాయంత్రం 18.45 గంటలకు సంబల్‌పూర్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 04.55 గంటలకు దువ్వాడ చేరుకుని మరలా 05.00 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 23.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. 08322 ఎస్‌ఎంవి బెంగళూరు – సంబల్‌పూర్‌ ప్రత్యేక రైలు జూన్‌ 1 నుంచి జూన్‌ 29 వరకు ప్రతి శనివారం అర్ధరాత్రి 01.15 గంటలకు ఎస్‌ఎంవి బెంగళూరు నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 20.30 గంటలకు దువ్వాడకు చేరుకుని మరలా 20.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06.30 గంటలకు సంబల్‌పూర్‌ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు బార్‌ఘర్‌ రోడ్డు, బలంగీర్‌, తిట్లాగఢ్‌, కేసింగ, మునిగూడ, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, గూడూరు, కృష్ణరాజ్‌పేట, జోలార్‌, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తాయి.
08325 సంబల్‌పూర్‌ – కాచిగూడ సమ్మర్‌ స్పెషల్‌ మే 27 నుంచి జూన్‌ 24 వరకు ప్రతి సోమవారం రాత్రి 21.00 గంటలకు సంబల్‌పూర్‌లో బయలుదేరి మరుసటి ఉదయం 07.20 గంటలకు దువ్వాడ చేరుకుని మరలా 07.25 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 21.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. 08326 కాచిగూడ – సంబల్‌పూర్‌ సమ్మర్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ మే 28 నుండి జూన్‌ 25 వరకు ప్రతి మంగళవారం రాత్రి 23.20 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు దువ్వాడ చేరుకుని 12.35 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 23.45 గంటలకు సంబల్‌పూర్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లు బర్‌గఢ్‌ రోడ్డు, బలంగీర్‌, తిట్లగఢ్‌, కేసింగ, మునిగూడ, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, తుని, పిఠాపురం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చెర్లపల్లి, మల్కాజిగిరి మీదుగా ప్రయాణిస్తాయి.

➡️