యుపిఐ చెల్లింపులపైనా ఫీజు..

Mar 12,2025 06:41 #Business, #Fees, #on UPI payments
  • కేంద్రం యోచన

న్యూఢిల్లీ : యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యుపిఐ), రూపే డెబిట్‌ కార్డుల ద్వారా నిర్వహించే లావాదేవీలపై మర్చెంట్‌ ఫీజులను తిరిగి వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన బ్యాంకింగ్‌ అసోసియేషన్‌ ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యుపిఐ లావాదేవీలపైన ఎటువంటి అదనపు ఛార్జీలు లేవు. కాగా.. వార్షిక ఆదాయం రూ. 40 లక్షల కంటే ఎక్కువ ఉన్న వ్యాపారుల యుపిఐ చెల్లింపుల మీద మర్చెంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండిఆర్‌)ను మళ్ళీ తీసుకురావాలని ప్రతిపాదిస్తూ బ్యాంకింగ్‌ ఇండిస్టీ ప్రతినిధులు కేంద్రానికి పంపించారు. ఇది త్వరలోనే అమల్లోకి రానుందని రిపోర్టులు వస్తోన్నాయి. వీసా కార్డు, మాస్టర్‌ కార్డు వంటి డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డుల లావాదేవీలపై మర్చెంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ చెల్లిస్తున్నారు. అదే తరహాలో యుపిఐ, డెబిట్‌ కార్డుల చెల్లింపుల పైనా కూడా చార్జీలు వసూలు చేయాలని కేంద్రం భావిస్తోంది. అయితే రూ.40 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగిన వ్యాపారులపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఫిన్‌టెక్‌ సంస్థల ప్రతినిధులు ఇటీవల ఆర్‌బిఐ గవర్నర్‌ సంజరు మల్హోత్రాతో భేటీలోనూ ఎండిఆర్‌ అమలు అంశాన్ని ప్రస్తావించారు.

➡️