రామ్కీ ఇన్‌ఫ్రాకు ఫిక్కీ అవార్డు

Jun 11,2024 21:33 #Business

హైదరాబాద్‌ : రామ్కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ (ఫిక్కీ) అవార్డు దక్కింది. ఫిక్కీ స్మార్ట్‌ అర్బన్‌ ఇన్నోవేషన్‌ అవార్డు 2024లలో ”సస్టెయినబుల్‌ సిటీస్‌” విభాగంలో ఈ ప్రశంసను పొందినట్లు రామ్కీ ఇన్‌ఫ్రా మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ గుర్తింపు హైదరాబాద్‌లోని జవహర్‌ నగర్‌లో ఉన్న లీచేట్‌ శుద్ధి వినూత్న పరిష్కారాలకు గుర్తింపు అని తెలిపింది. దేశంలోని స్మార్ట్‌ సిటీల మిషన్‌ కోసం పని చేస్తున్న 98 ఎంట్రీల నుండి గుర్తింపు పొందిన 10 సంస్థలలో రామ్కీ ఒక్కటిగా నిలిచిందని ఆ సంస్థ ఎండి వైఆర్‌ నాగరాజ పేర్కొన్నారు.

➡️