ముంబయి : ప్రపంచ మార్కెట్‌లో రూపాయి విలువ తగ్గింది. మంగళవారం డాలర్‌తో రూపాయి విలువ ఐదు పైసలు పతనమై డాలర్‌తో 85.73 కనిష్ట స్థాయికి దిగజారింది. హెచ్చు చమురు ధరలు, విదేశీ సంస్థాగత నిధులు తరలిపోవడం రూపాయిపై ఒత్తిడిని పెంచాయి. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో 85.77 వద్ద తెరుచుకున్న రూపాయి విలువ.. ఇంట్రాడేలో ఏకంగా 85.80 కనిష్ట స్థాయిని తాకింది. ఇంతక్రితం సెషన్‌తో పోల్చితే 5 పైసలు తగ్గి 85.73 వద్ద ముగిసింది. సోమవారం సెషన్‌లో 11 పైసలు పెరిగి 85.68 వద్ద నమోదయ్యింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2025/01/rupee-2.jpg)