ఇన్విగా హెల్త్‌కేర్‌ ఈక్విటీ ఫండ్‌ ఏర్పాటు

Apr 17,2024 21:06 #Business, #iniga

హైదరాబాద్‌ : ఆరోగ్య సంరక్షణను అందరికీ అందుబాటులో తేవడమే లక్ష్యంగా ఇన్విగా హెల్త్‌ కేర్‌ ప్రయివేటు కొత్తగా ఈక్విటీ ఫండ్‌ను ప్రారంభించినట్లు హెల్త్‌కేర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (హెచ్‌సిజి) వ్యవస్థాపకుడు డాక్టర్‌ అజరు కుమార్‌ తెలిపారు. వ్యవస్థాపకులకు మద్దతును అందించడానికి దాదాపుగా రూ.167 కోట్లు (20 మిలియన్‌ డాలర్లు) ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మానవ శ్వాసకోశ వైరల్‌ వ్యాధుల కోసం వినూత్నరీకాంబినెంట్‌ వ్యాక్సిన్‌లను అభివృద్థి చేయడంపై దృష్టి సారించిన బయోటెక్‌ స్టార్టప్‌ మైన్‌వాక్స్‌లో తొలి పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించారు.

➡️