టెక్‌ మహీంద్రా మాజీ బాస్‌ వినీత్‌ నయ్యర్‌ మృతి

May 16,2024 21:30 #Business, #Tech Mahindra

ముంబయి : టెక్‌ మహీంద్రా లిమిటెడ్‌ మాజీ సిఇఒ వినీత్‌ నయ్యర్‌ (85 ఏళ్లు) మృతి చెందారు. ఐఎఎస్‌ అధికారిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన తన 40 ఏళ్ల కెరీర్‌లో అనేక ప్రభుత్వ, ప్రయివేటు కార్పొరేట్‌ రంగాల్లో పనిచేశారు. 2009లో సత్యం కంప్యూటర్స్‌ కుప్పకూలిన సమయంలో ఆ సంస్థను టెక్‌ మహీంద్రాలో విలీనం చేయడంలో కీలక పాత్ర పోశించారు. వినీత్‌ మృతికి టెక్‌ ఇండిస్టీ బాడీ నాస్కామ్‌ సంతాపం తెలిపింది. భారతీయ వ్యాపార రంగంలో వినీత్‌ అతి పెద్ద వ్యక్తి అని మహీంద్రా గ్రూపు ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా పేర్కొన్నారు.

➡️