ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ వెల్లడి
న్యూఢిల్లీ : ఖాతాదారుల భద్రతను బలోపేతం చేసేందుకు 14సి రియల్ టైమ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (ఎపిఐ)తో లైవ్ అవుతున్న మొదటి చెల్లింపుల బ్యాంకుగా తమ సంస్థ నిలిచిందని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (ఎపిఐ) ద్వారా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14సి) నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో తమ వ్యవస్థలను విజయవంతంగా అనుసంధానించినట్లు పేర్కొంది. ఈ సేవలు అందిస్తోన్న నాలుగు బ్యాంక్‌ల్లో తమదొక్కటని తెలిపింది.
