గెయిల్‌ లాభాలు మూడింతలు

May 16,2024 21:26 #Business, #gail india

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద గ్యాస్‌ సరఫరా కంపెనీ గెయిల్‌ ఇండియా ఆదాయాలు తగ్గినప్పటికీ నికర లాభాలు మూడింతలు పెరిగాయి. 2024 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 260 శాతం వృద్థితో రూ.2,177 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఇదే త్రైమాసికంలో రూ.603.5 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.33,875 కోట్లుగా ఉన్న ఆదాయం.. గడిచిన క్యూ4లో స్వల్పంగా 2.6 శాతం తగ్గి రూ.32,317 కోట్లుగా చోటు చేసుకుంది. 2023-24లో గెయిల్‌ నికర లాభాలు 66.6 శాతం పెరిగి రూ.8,836.48 కోట్లకు చేరాయి. 2022-23లో రూ.5,301.51 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.1,46,986 కోట్లుగా ఉన్న ఆదాయం.. గడిచిన 2023-24లో 9.6 శాతం తగ్గి రూ.1,32,846 కోట్లుగా చోటు చేసుకుంది.

➡️