న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్ కొత్తగా ఎఐ ఆధారిత గెలాక్సీ బుక్5 సిరీస్ పర్సనల్ కంప్యూటర్లను విడుదల చేసింది. గెలాక్సీ బుక్5 ప్రో, బుక్ ప్రో 360, బుక్5 360 మోడళ్లను ఆవిష్కరించింది. గెలాక్సీ ఎఐ సహా మైక్రోసాఫ్ట్ కాపిలోట్ ప్లస్ పిసి అనుభవం, ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 2 ప్రాసెసర్‌తో వీటిని అభివృద్ధి చేసింది. వీటి ప్రారంభ ధరలను రూ.1,14,990గా నిర్ణయించింది.
