మార్కెట్లోకి గెలాక్సీ ఎస్‌24 ఎఫ్‌ఇ

Sep 30,2024 20:51 #Business, #phones, #samsung

న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి గెలాక్సీ ఎస్‌ 24ఎఫ్‌ఇని విడుదల చేసినట్లు తెలిపింది. 6.7 అంగుళాల డైనమిక్‌ అమోలెడ్‌ 2ఎక్స్‌ డిస్ప్లే, 4,700 ఎంఎహెచ్‌ బ్యాటరీలో ఆవిష్కరించింది. 8జిబి ర్యామ్‌, 128జిబి స్టోరేజీ ధరను రూ.59,999గా, 8జిబి, 256 వేరియంట్‌ ధరను రూ.65,999గానిర్ణయించింది. 50 ప్రైమరీ కెమెరా, 8ఎంపి, 12 ఎంపి కెమెరాలు సహా సెల్ఫీ కోసం 10 ఎంపి కెమెరాను అమర్చింది.

➡️