GDP Growth : రెండేళ్ల కనిష్టానికి జిడిపి వృద్ధి

న్యూఢిల్లీ :   భారత్‌లో  స్థూల జాతీయోత్పత్తి ( జిడిపి ) వృద్ధి రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. జులై -సెప్టెంబర్‌ త్రైమాసికంలో జిడిపి వృద్ధి 5.4 శాతంగా ఉన్నట్లు  శుక్రవారం విడుదలైన అధికారిక సమాచరం తెలిపింది.  గతేడాది ఇదే త్రైమాసికంలో జిడిపి వృద్ధి 8.1 శాతంగా ఉంది. తయారీ రంగంలో క్షీణత కారణంగా వృద్ధి నెమ్మదించినట్లు పేర్కొంది.
2022-23 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (అక్టోబర్‌ -డిసెంబర్‌ 2022)లో మునుపటి కంటే కనిష్టం 4.3 శాతంగా ఉంది. వ్యవసాయం రంగ స్థూల విలువ జోడింపు (జివిఎ) 3.5 శాతంగా ఉంది. గతేడాది జులై -సెప్టెంబర్‌ త్రైమాసికంలో 1.7 శాతంగా నమోదైంది.

➡️