Gold – మళ్లీ పసిడి పరుగు..!

Mar 26,2025 13:22 #Another golden run

అమరావతి : గత కొంతకాలం నుంచి బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయితే గత 4, 5 రోజలుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్‌ రేట్స్‌.. మళ్లీ ఈరోజు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110 పెరగగా, 22 క్యారెట్లపై రూ.100 పెరిగింది. బుధవారం బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,400గా, 22 క్యారెట్ల ధర రూ.81,950గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా కొనుగోలుదారులకు షాకిచ్చాయి. వరుసగా రెండో రోజులు తగ్గి, ఆపై మూడు రోజులు స్థిరంగా ఉన్న సిల్వర్‌ రేట్‌ నేడు పెరిగింది. కిలో వెండిపై ఒక వెయ్యి పెరిగి.. బులియన్‌ మార్కెట్‌లో రూ.1,02,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 11 వేలుగా నమోదైంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.1,02,000గా ఉంది. బంగారం, వెండి ధరలు ఆయా రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ ధరలు ఈరోజు ఉదయం 10 గంటలకు నమోదయ్యాయి.

➡️