రూ.2080 తగ్గిన బంగారం

Jun 8,2024 22:46 #Business, #Gold

హైదరాబాద్‌ : అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులకు అనుగు ణంగా దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దిగివచ్చాయి. గుడ్‌రిటర్న్స్‌ ప్రకారం.. శనివారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.2080 తగ్గి రూ.71,670గా నమోదయ్యింది. 22 క్యారెట్లపై రూ.1900 తగ్గి రూ.65,700గా పలికింది. కిలో వెండిపై రూ.4500 దిగివచ్చి రూ.96,000కు చేరింది. ఇటీవలి కాలంలో బంగారం ధర భారీగా తగ్గడం ఇదే తొలిసారి.

➡️