సామ్‌సంగ్‌ ఎసిల్లో ‘గుడ్‌ స్లీప్‌’ టెక్నాలజీ

Jan 11,2025 22:47 #Business, #samsung

గూర్‌గావ్‌ : సామ్‌సంగ్‌ కొత్తగా విండ్‌ఫ్రీ ఎసిలను ఆవిష్కరించినట్లు తెలిపింది. వీటిల్లో నిద్ర దశల ప్రకారం ఉష్ణోగ్రతను సర్దుబాటు చేయడం ద్వారా రాత్రంతా ఆహ్లాదకరమైన నిద్రను పొందవచ్చని పేర్కొంది. ఇందుకోసం సామ్‌సంగ్‌ ‘గుడ్‌ స్లీప్‌’ మోడ్‌ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. వినియోగదారులు తమ ఎయిర్‌ కండిషనర్‌లను వారి గెలాక్సీ వాచ్‌ సిరీస్‌తో కనెక్ట్‌ చేయడానికి, వారు నిద్రలోకి జారుకున్నప్పుడు ‘గుడ్‌ స్లీప్‌’ ఆటోమెటిక్‌గా పనిచేయటానికి వీలు కల్పిస్తుందని తెలిపింది. వినియోగదారులు ఎంపిక చేసిన సామ్‌సంగ్‌ విండ్‌ఫ్రీ ఎయిర్‌ కండిషనర్‌లను కొనుగోలు చేయడంపై 42 శాతం వరకు తగ్గింపు పొందవచ్చని పేర్కొంది.

➡️