రూ.1.95 లక్షల కోట్ల జిఎస్‌టి ఎగవేతలు

ముంబయి : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జనవరి కాలంలో రూ.1.95 లక్షల కోట్ల విలువ చేసే వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) ఎగవేతలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ తొమ్మిది మాసాల్లో 25,397 ఎగవేత కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరీ సోమవారం పార్లమెంట్‌కు తెలిపారు. గడిచిన ఐదేళ్లలో మొత్తంగా 86,711 కేసులను గుర్తించగా.. రూ.6.79 లక్షల కోట్ల ఎగవేతలు జరిగాయన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఐటిసి అత్యధికంగా 13,018 కేసుల్లో రూ.46,472 కోట్లకు సంబంధించిన పన్నులను ఎగవేసినట్లు గుర్తించామన్నారు. 2023-24లో రూ.20,582 కేసుల్లో రూ.2.30 లక్షల కోట్లు, 2022-23లో 1.32 లక్షల కోట్లు, 2021-22లో రూ.73,238 కోట్లు, 2020-21లో రూ.49,384 కోట్ల ఎగవేతలు జరిగాయన్నారు.

➡️