ఐటిబిపికి జిమ్నీ వాహనాలు

Feb 8,2025 21:22 #Business, #Jimny vehicles. ITBP

న్యూఢిల్లీ : ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీసు (ఐటిబిపి) ఫోర్స్‌కు తాము 60 జిమ్నీ ఎస్‌యువి వాహనాలను అందించడానికి మారుతి సుజుకి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలో ఐటిబిపి అడిషనల్‌ డైరెక్టర్‌ అబ్దుల్‌ ఘని మీర్‌కు మారుతి సుజుకి మార్కెటింగ్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పార్థో బెనర్జీ వాహనాలను అందించారు. వీటిని లేహ్-లద్దాక్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ రీజియన్‌లో ఉపయోగించనున్నట్లు పేర్కొంది.

➡️