బంగారం బిస్కెట్లకు హాల్‌మార్కింగ్‌

Dec 6,2024 23:10 #Business

న్యూఢిల్లీ : బంగారం కడ్డీలపై కూడా ఇకపై హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. శుక్రవారం సిఐఐ ప్రతినిధులతో జరిగిన ఓ సమావేశంలో వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే ఈ విషయాన్ని తెలిపారు. నాణ్యత కోసం బంగారం బిస్కెట్లపైనా హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయాలని యోచిస్తున్నామన్నారు. ప్రతీ అభరణంపై హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేస్తూ 2021 జూన్‌లో నిర్ణయం తీసకున్నారు. ఇప్పటి వరకు 40 కోట్లకు పైగా పసిడి అభరణాలపై హాల్‌మార్క్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌ను వేశారు.

 

➡️