హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు రూ.16,736 కోట్ల లాభాలు

ముంబయి : ప్రయివేటు రంగంలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ ఆర్ధిక సంవత్సరం 2024-25 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 2.2 శాతం వృద్ధితో రూ.16,736 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. 2023-24 ఇదే త్రైమాసికంలో రూ.16,373 కోట్ల లభాలు నమోదు చేసింది. క్రితం క్యూ3లో ఆ బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 7.7 శాతం పెరిగి రూ.30,650 కోట్లకు చేరింది. 2024 డిసెంబర్‌ 31 నాటికి బ్యాంక్‌ స్థూల అడ్వాన్సులు 3 శాతం పెరిగి రూ.25,42,600 కోట్లకు చేరాయి. స్థూల నిరర్ధక ఆస్తులు 1.42 శాతానికి పెరిగాయి. ఇంతక్రితం ఏడాది నాటికి 1.26 శాతంగా జిఎన్‌పిఎ ఉంది. 2024 ముగింపు నాటికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ 9,143 శాఖలు, 21,049 ఎటిఎం కేంద్రాలను కలిగి ఉంది.

➡️