- ఆర్‌బిఐ ఆమోదం
న్యూఢిల్లీ : కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఎయు ఎస్‌ఎఫ్‌బి, కాపిటల్ ఎస్‌ఎఫ్‌బిలో 9.50 శాతం వాటాను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గ్రూపు స్వాధీనం చేసుకోవడానికి ఆర్‌బిఐ ఆమోదం తెలిపింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టాలని భావించినప్పటికీ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గ్రూప్ సంస్థల సమగ్ర హోల్డింగ్ నిర్ణీత పరిమితి 5 శాతం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, పెట్టుబడి పరిమితుల పెంపు కోసం ఆర్‌బిఐ ఆమోదం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. ఆర్‌బిఐ ఉత్తర్వుల మేరకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన గ్రూప్ సంస్థలయిన హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, హెచ్‌డిఎఫ్‌సి ఇఆర్‌జిఓ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, హెచ్‌డిఎఫ్‌సి పెన్షన్ ఫండ్ మేనేజ్‌మెంట్ తదితర సంస్థలు పైన పేర్కొన్న బ్యాంకులలో 9.50 శాతం మించకుండా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది.