హోమ్‌లేన్‌ చేతికి డిజైన్‌ కేఫ్‌

న్యూఢిల్లీ : ఇంటీరియర్‌ డెకర్‌ సొల్యూషన్స్‌ సంస్థ హోమ్‌లేన్‌ తన పోటీ సంస్థ డిజైన్‌ కేఫ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. అదే విధంగా ఇన్వెస్టర్ల నుంచి కొత్తగా 30 మిలియన్‌ డాలర్లు (రూ.250 కోట్లు) నిధులు సమీకరించినట్లు హోమ్‌లేన్‌ తెలిపింది. ఈ నిధులను హీరో ఎంటర్‌ప్రైస్‌, వెస్ట్‌బ్రిడ్జ్‌ కాపిటల్‌ నుంచి పొందినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ రెండు సంస్థల రెవెన్యూ 108 మిలియన్‌ డాలర్లు (రూ.900 కోట్లు)గా ఉందని అంచనా వేసింది.

➡️