వాషింగ్టన్ : ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుల్లో ఒక్కరైనా వారెన్ బఫెట్ తన వారసుడిగా హువర్డ్ బఫెట్‌ను ప్రకటించారు. దీంతో హువర్డ్ బెర్క్‌షైర్ హాత్‌వే కంపెనీకి ఛైర్మన్‌గా బాధ్యతలను చేపట్టనున్నారు. ప్రస్తుతం బెర్క్‌షైర్ వ్యాపార విలువ లక్ష కోట్ల డాలర్లుగా ఉంది. భారత కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.86 లక్షల కోట్లు. ప్రస్తుతం వారెన్ బఫెట్‌కు 94 ఏళ్లు.తన సంపదలో అత్యధిక మొత్తం కొత్తగా ఏర్పాటు చేసిన ఛారిటబుల్ ట్రస్ట్‌కు రాసి ఇచ్చినట్లు బఫెట్ ఇటీవల ఓ ఇంటర్యూలో తెలిపారు. తన ముగ్గురు పిల్లలకు అతి తక్కువ సంపద మాత్రమే ఇస్తున్నట్లు వెల్లడించారు.
