వాషింగ్టన్ : ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మరోమారు ఉద్యోగులపై వేటు వేస్తోంది. ఈసారి ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్ టీమ్‌ల నుంచి వందలాది మంది ఉద్యోగులను తొలిగించేస్తోందని సమాచారం. ఇప్పటికే వీరికి నోటీసులు కూడా పంపినట్లు రిపోర్టులు వస్తున్నాయి. ఆపరేషన్‌లను స్ట్రీమ్‌లైన్ చేయడం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధిక వృద్ధి రంగాలలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం కోసమే ఉద్వాసనలు చేపడుతోందని పరిశ్రమ వర్గాల అంచనా. మరోవైపు ఆర్థిక అనిశ్చితులు, ఎఐ ప్రాజెక్టుల వ్యయం పెరగడం కూడా కారణమని తెలుస్తోంది.
