ముంబయి : ప్రయివేటు రంగంలోని దిగ్గజ విత్త సంస్థ ఐసిఐసిఐ బ్యాంక్ తన డిపాజిట్‌దారులకు షాకిచ్చింది. తమ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. పొదుపు ఖాతాలపై వడ్డీ రేటులో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించినట్లు పేర్కొంది. సవరించిన వడ్డీ రేట్లను ఏప్రిల్ 16 నుంచే అమల్లోకి వచ్చాయని పేర్కొంది. సేవింగ్ ఖాతాల్లో రూ.50 లక్షల లోపు వరకు నిల్వ ఉంటే కేవలం 2.75 శాతం వడ్డీని చెల్లించనుంది. గతంలో ఇది 3 శాతంగా ఉంది. ఇప్పటికే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించాయి.
