ఫిబ్రవరిలో ఐఐపి 5.7 శాతం

Apr 12,2024 21:25 #Business

న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాదిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి)5.7 శాతానికి పెరిగిందని గణంకాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంతక్రితం జనవరిలో 3.8 శాతంగా చోటు చేసుకుంది. 2023 ఇదే ఫిబ్రవరిలో 6 శాతం వృద్థి నమోదయ్యింది. 2023 అక్టోబర్‌లో రికార్డ్‌ స్థాయిలో 11.9 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. 2023ా24 ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి కాలంలో పారిశ్రామికోత్పత్తి సూచీ 5.9 శాతానికి చేరింది. ఇంతక్రితం ఏడాది ఇదే సమయంలో 5.6 శాతం పెరుగుదల చోటు చేసుకుంది.

➡️