వినియోగదారుల డిమాండ్‌ : ఐదేళ్లలో డైమండ్‌, బంగారు ఆభరణాలు పెరిగిన దిగమతులు

May 14,2024 19:01 #Business

మన దేశంలో గత ఐదేళ్లలో లగ్జరీ వస్తువులకు డిమాండ్‌ బాగా పెరిగింది. వినియోగదారుల డిమాండ్‌ మేరకు డైమండ్‌, రత్నాల ఆభరణాలు, వస్త్ర వ్యాపార రంగంలోనూ దిగుమతులు పెరిగాయని భారత వాణిజ్య వర్తక విశ్లేషణలే తెలియజేస్తున్నాయి. గడచిన ఐదేళ్లలో (2019-2024) డైమండ్స్‌, బంగారం ఉత్పత్తుల ఎగుమతులు 18.78 శాతానికి తగ్గాయి. ఈ కాలంలోనే 32.85 బిలియన్ల నుండి 78.47 బిలియన్ల మేర దిగుమతులు పెరిగాయి. సుమారుగా 21.25 శాతం మేర దిగుమతులు పెరిగాయి. ఇక వస్త్ర వ్యాపార రంగంలో కూడా ఎగుమతులు గత ఐదేళ్లలో క్షీణించాయి. సుమారు 7.10 శాతం ఎగమతులు తగ్గాయి. అదే సమయంలో దిగుమతులు 20.33 శాతం మేర పెరిగాయి.
వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, ఖనిజాలు, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్‌, టెలికాం వంటి సెక్టార్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో వృద్ధి కనిపిస్తోందని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ విశ్లేషణ తెలియజేస్తోంది. ఈ ఐదేళ్లలో ఎలక్ట్రానిక్స్‌ కంప్యూటర్‌, టెలికాం ఉత్పత్తుల్లో 52.37 శాతం పెరిగాయి. వ్యవసాయం, మాంసం ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ఎగుమతులు 32 శాతం మేర పెరిగాయి.
పెట్రోల్‌, ఖనిజాలు కూడా ఎగుమతి, దిగుమతులు పెరిగాయి. ఎగముతి 80 శాతంగా ఉంటే.. దిగుమతి 31.55 శాతంగా ఉన్నాయి. రసాయనాలు, ఫార్మా ఎగుమతులు 32 శాతం మేర పెరిగాయి. ఆటోసెక్టార్‌ రంగంలో ఎగుమతులు 15.47 శాతం ఈ ఐదేళ్లలో పెరిగాయి.

 

➡️