అధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లాభాల్లో పెరుగుదల

న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో అధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నికర లాభాలు 21 శాతం పెరిగి రూ.245 కోట్లుగా నపమోదయ్యాయి. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.202 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.692 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం.. గడిచిన క్యూ4లో రూ.834 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ.596 కోట్ల నుంచి రూ.722 కోట్లకు పెరిగింది. బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు 1.08 శాతం నుంచి 1.05 శాతానికి తగ్గాయి.

➡️