న్యూఢిల్లీ : భారత విదేశీ మారకం నిల్వలు వరుసగా రెండో వారంలోనూ పెరిగాయి. జనవరి 31తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 1.05 బిలియన్ డాలర్లు పెరిగి 630.61 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్‌బిఐ వెల్లడించింది. అంతకుముందు వారంలోనూ 5.57 బిలియన్ డాలర్లు పెరిగి 629.56 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం కొన్ని వారాల పాటు భారీగా ఫారెక్స్ నిధులు పడిపోయాయి. గతేడాది సెప్టెంబర్ చివరినాటికి విదేశీ మారక నిల్వలు రికార్డ్ స్థాయిలో 704.88 బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయికి పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయంగా భారత మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొవడం, ఎఫ్‌ఐఐలు తరలిపోవడంతో ఇటీవలి కాలంలో భారీగా పతనమయ్యాయి.
