పెరిగిన విదేశీ మారకం నిల్వలు

Feb 11,2024 10:11 #Business

న్యూఢిల్లీ : భారత విదేశీ మారకం నిల్వల్లో పెరుగుదల నమోదయ్యింది. ఫిబ్రవరి 2తో ముగిసిన వారంలో 5.736 బిలియన్‌ డాలర్లు పెరిగి రికార్డు స్థాయిలో 622.469 బిలియన్లకు చేరాయని రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. భారత విదేశీ మారక నిల్వలలో అతిపెద్ద వాటా విదేశీ కరెన్సీ ఆస్తులు కాగా.. ఇది 5.186 బిలియన్‌ డాలర్లు పెరిగి 551.331 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. బంగారం నిల్వలు 680 మిలియన్‌ డాలర్లు పెరిగి 48బిలియన్‌ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. 2021 అక్టోబర్‌లో భారత విదేశీ మారక నిల్వలు గరిష్ఠ స్థాయిలో 645 బిలియన్‌ డాలర్లకు చేరుకోగా… ఆ తర్వాత కాలంలో దిగుమతుల వ్యయం పెరగడంతో 2022లో మారక నిల్వలు గణనీయంగా తగ్గాయి. తాజాగా పెరుగుదల కనబడటం విశేషం.

➡️