భారత వృద్థి 7% లోపే..!- యుబిఎస్‌ వెల్లడి

Jun 11,2024 21:05 #Business

న్యూఢిల్లీ : వచ్చే ఐదేళ్లలో భారత వృద్థి రేటు 7 శాతం లోపే ఉండొచ్చని స్విస్‌ బ్రోకరేజీ దిగ్గజం యుబిఎస్‌ పేర్కొంది. 2025ా26 నుంచి 2029ా30 మధ్య ప్రతీ ఏడాది సగటున 6.5ా7 శాతం మధ్య వృద్థి చోటు చేసుకోవచ్చని విశ్లేషించింది. బిజెపికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోవడంతో మిత్రపక్షాల మద్దతుతో అధికారాన్ని చేపట్టిన ప్రధాన మంత్రి మోడీకి ఈ దఫా కీలక సంస్కరణలపై నిర్ణయం సవాలేనని యువిఎస్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌ తన్వీ గుప్తా పేర్కొన్నారు. కాగా.. 2024ా25లో భారత జిడిపి 7.2 శాతంగా ఉండొచ్చని ఇటీవల రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంచనా వేసింది. ఈ ఏడాది ఆర్‌బిఐ వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చని యుబిఎ్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌ జైన్‌ అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది రెపో రేటు అర శాతం తగ్గొచ్చన్నారు.

➡️