ఇకపై అన్ని వయస్సుల వారికి వైద్య బీమా : ఐఆర్‌డిఎ వెల్లడి

Apr 21,2024 08:33 #Business, #health

న్యూఢిల్లీ : వైద్య బీమా పాలసీ కొనుగోలుకు వయస్సు నిబంధనను ఎత్తివేస్తూ ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డిఎ) నిర్ణయం తీసుకుంది. పాలసీ కొనుగోలు చేయడానికి గల వయో పరిమితి నిబంధనను తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఇక నుంచి వైద్య బీమా పాలసీని వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇంతకు ముందు గరిష్టంగా 65 ఏళ్ల వరకు మాత్రమే వైద్య బీమా తీసుకునే వీలుండేది. సీనియర్‌ సిటిజన్ల కోసం ప్రత్యేక పాలసీను ఆవిష్కరించాలని ఐఆర్‌డిఎ సూచించింది. వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చానెల్‌ ఏర్పాటు చేయాలని పేర్కొంది. తాజా నిర్ణయాన్ని బీమా కంపెనీలు స్వాగతించాయి.

➡️