జెట్‌ ఎయిర్‌వేస్‌ నరేష్‌ గోయల్‌ సతీమణి మరణం

ముంబయి : జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకులు నరేష్‌ గోయల్‌ భార్య అనితా గోయల్‌ మరణించారు. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ముంబయిలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ.. ఆరోగ్యం క్షీణించడంతో గురువారం కన్నుమూశారు. నరేశ్‌ గోయల్‌ కూడా గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కెనరా బ్యాంక్‌కు రూ.539 కోట్ల అప్పుల చెల్లింపుల్లో నరేష్‌ గోయల్‌ విఫలం కావడంతో పాటు బ్యాంక్‌ల నుంచి తీసుకున్న రుణాలను మనీలాండరింగ్‌కు ఉపయోగించిన ఆరోపణలపై సిబిఐ, ఇడి విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఇడి నరేష్‌ గోయల్‌ను గత సెప్టెంబర్‌లో అరెస్ట్‌ చేసింది. అప్పటి నుంచి జైల్లో ఉన్న ఆయన భార్య అనారోగ్యం కారణంగా కొద్ది రోజుల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చారు.

➡️