ఇక ‘జియో హాట్‌స్టార్’గా ప్రయాణం
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండిస్టీస్‌కు చెందిన వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనంలో భాగంగా కొత్త ఒటిటి ‘జియోస్టార్’ను ఆవిష్కరించాయి. ఈ ఒటిటి వేదికలో జియో సినిమా, డిస్నీ, హాట్‌స్టార్‌ను కూడా ఒకే వేదిక పైకి తీసుకొచ్చాయి. రూ.149 నుంచే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయని శుక్రవారం ఇరు సంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి. మూడు లక్షల గంటల ఎంటర్‌టైన్‌మెంట్, లైవ్ స్పోర్ట్స్ కవరేజీ, 50కోట్ల మందికి పైగా యూజర్లతో ఇకనుంచి ‘జియోహాట్‌స్టార్’ మరింత కొత్తగా ప్రేక్షకులను అలరించనుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఉన్న జియో సినిమా, డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్ చందాదారులు సజావుగా కొత్త సేవలను కొనసాగించుకోవచ్చని పేర్కొన్నాయి.
