ఇమామి ప్రచారకర్తగా కార్తీక్‌ ఆర్యన్‌

కోల్‌కత్తా : ప్రముఖ ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తుల కంపెనీ ఇమామీ తన ఫెయిర్‌ అండ్‌ హ్యాండ్‌ సమ్‌కు బ్రాండ్‌ అంబాసీడర్‌గా బాలీవుడ్‌ స్టార్‌ త్రోబ్‌ కార్తిక్‌ ఆర్యన్‌ను నియమించుకున్నట్లు వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న పురుష సౌందర్య ఉత్పత్తుల మార్కెట్‌లో తాము మరింత పటిష్టం కోసం సిద్దంగా ఉన్నామని ఇమామీ లిమిటెడ్‌ వైస్‌ ఛైర్మన్‌ మోహన్‌ గోయెంకా తెలిపారు. 2005లో ప్రారంభించిన ఈ బ్రాండ్‌ను పునర్నామకరణం చేసినట్లు వెల్లడించారు. భారత్‌లో ఈ మార్కెట్‌ రూ.18,000 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.

➡️