అద్దెకు కియా కార్లు

Aug 31,2024 23:01 #Business, #kia cars

హైదరాబాద్‌ : తమ కార్లను కొనుగోలు చేయకుండా అద్దెకు పొందే సౌలభ్యాన్ని కియా కార్స్‌ అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఎఎల్‌డి ఆటోమోటివ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. దేశంలోని హైదరాబాద్‌ సహా 14 నగరాల్లో కియా సబ్‌స్రైబ్‌ పేరుతో ఈ సేవలను ప్రారంభించింది. 12-36 నెలల వ్యవధికి కార్లను అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. సోనెట్‌కు నెలకు రూ.19,999, సెల్టోస్‌కు రూ.23,999, కారెన్స్‌కు రూ.24,999కు చొప్పున వసూలు చేయనున్నట్లు కియా ఇండియా ఉన్నతాధికారి హర్దీప్‌ సింగ్‌ బ్రార్‌ పేర్కొన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా అద్దె సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు.

➡️