హైదరాబాద్: కియా ఇండియా కొత్తగా కియా సైరోస్ కారును ఆవిష్కరించింది. దీని ఎక్స్‌షోరూం ధరల శ్రేణీని రూ.8.9-17.80 లక్షలుగా నిర్ణయించింది. ఈ ఎస్‌యువిని పలు అద్భుతమైన ఫీచర్లు, పవర్ ట్రైన్ ఆప్షన్లలో అందుబాటులోకి తెచ్చినట్లు ఆ కంపెనీ తెలిపింది. 1.0 లిటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో ఆవిష్కరించినట్లు పేర్కొంది. ఈ మోడల్‌లో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వర్షన్ కూడా లభిస్తుందని తెలిపింది.
