కియా లక్ష యూనిట్ల ఎగుమతి

ప్రజాశక్తి – బిజినెస్‌ బ్యూరో : కియా ఇండియా తమ అనంతపురం ప్లాంట్‌లో తయారు చేసిన 1,00,00 యూనిట్ల సికెడి వాహనాలను ఎగుమతి చేసినట్లు వెల్లడించింది. 2020 జూన్‌లో ఇక్కడి నుంచి ఎగుమతులను ప్రారంభించినట్లు తెలిపింది. దేశీయంగా తయారు చేస్తున్న తమ వాహనాలకు భారత్‌ కీలక ఎక్స్‌పోర్ట్‌ హబ్‌గా మారనుందని పేర్కొంది. భారత్‌ ఒక కీలక ఎగుమతి కేంద్రంగా స్థాపించడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నాలకు ఈ విజయం ఓ నిదర్శనమని కియా మోటార్స్‌ చీఫ్‌ సేల్స్‌ ఆఫీసర్‌ జున్సు చో తెలిపారు. ఉజ్బెకిస్తాన్‌, ఈక్వెడార్‌, వియత్నా మార్కెట్లకు అధికంగా 38వేల యూనిట్ల ఎగమతులు చేసినట్లు వెల్లడించారు.

➡️