హైదరాబాద్ : ప్రముఖ ట్రాక్టర్ల తయారీదారు ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ (టఫే) వైస్ చైర్మన్‌గా డాక్టర్ లక్ష్మీ వేణు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె ప్రముఖ ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థ సుందరం క్లేటన్ లిమిటెడ్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. టఫే డైరెక్టర్‌గా లక్ష్మీ వ్యవసాయ యాంత్రీకరణ, ఆటోమొబైల్ భాగాల వ్యాపారంలో ఆమె సాధించిన విజయాలు గొప్పవని టఫే సిఎండి మల్లికా శ్రీనివాసన్ పేర్కొన్నారు. తన విశేష సహకారాన్ని గుర్తించి బోర్డు ఆమెను వైస్ ఛైర్మన్‌గా ఎంపిక చేసిందన్నారు.
