మార్కెట్లపై ఆలస్యంగా ట్రంప్‌ దెబ్బ..!

Nov 8,2024 08:33 #Business, #sen sex
  • సెన్సెక్స్‌ 836 పాయింట్ల పతనం

ముంబయి : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుపు భారత స్టాక్‌ మార్కెట్లలో భయాలను నింపాయి. ట్రంప్‌ వల్ల లాభాలు ఉండొచ్చని తొలుత భావించిన ఇన్వెస్టర్లు బుధవారం భారీగా కొనుగోళ్లకు మొగ్గు చూపగా.. గురువారం పరిస్థితి తారుమారైంది. ట్రంప్‌ అధ్యక్షుడు అయితే భారత ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించవచ్చని.. దీంతో జరిగే నష్టాలను మదుపర్లు ఆలస్యంగా గ్రహించారు. ఈ నేపథ్యంలోనే గురువారం భారీగా అమ్మకాలు చోటు చేసుకున్నాయి. నిఫ్టీ -50లో ఏకంగా 46 స్టాక్స్‌ కూడా నష్టాలను చవి చూశాయి. మరోవైపు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల ప్రకటన వెలుపడనున్న నేపథ్యంలోనూ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహారించారు. ఈ నేపథ్యంలో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 836 పాయింట్లు లేదా 1.04 శాతం పతనమై 79,541కి పడిపోయింది. అదే బాటలో ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 285 పాయింట్ల నష్టంతో 24,199 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేరు మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. భారత ఎగుమతులపై ట్రంప్‌ అధిక సుంకాలు విధించే అవకాశాలు ఉన్నాయనే సాంకేతాలు మదుపర్లను నిరుత్సాహానికి గురి చేశాయి.

➡️