ముంబయి : లైటింగ్ రంగంలో ఆటోమేషన్, ఇంధన పొదుపు, వినూత్న కల్పనలపై వచ్చే నెలలో ఎల్‌ఇడి ఎక్స్‌పోను నిర్వహించనున్నట్లు ఫ్రాంక్‌ఫర్ట్ ట్రేడ్ ఫెయిర్స్ ఇండియా తెలిపింది. ఏప్రిల్ 3-5 తేదిల్లో ముంబయిలో దీన్ని ఏర్పాటు చేస్తోన్నట్లు పేర్కొంది. ఇందులో 200 మంది ఎగ్జిబిటర్లు తమ 6000 పైగా వినూత్న ఉత్పత్తులను ప్రదర్శించనున్నారని వెల్లడించింది.
