వైద్య బీమాలోకి ఎల్‌ఐసి..!

Nov 29,2024 03:11 #Business, #Insurance, #LIC into, #medical

ముంబయి : దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా కంపెనీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించడానికి కసరత్తు చేస్తోంది. ఇందుకోసం మణిపాల్‌ సిగ్నా హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో 50 శాతం వాటా కొనుగోలుకు చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం మణిపాల్‌ సిగ్నా హెల్త్‌ అనేది మణిపాల్‌ ఎడ్యుకేషన్‌, మెడికల్‌ గ్రూప్‌, అమెరికాకు చెందిన సిగ్నా కార్పొరేషన్‌ సంయుక్త భాగస్వామ్యంలో నడుస్తోంది. ఇందులో మణిపాల్‌ గ్రూపునకు 51 శాతం, సిగ్నాకు 49 శాతం చొప్పున వాటా ఉంది. ఎల్‌ఐసి వాటా కొనుగోలు చేయాల్సి వస్తే.. ఆ రెండు సంస్థలు సమానంగా తమ వాటాను తగ్గించుకోనున్నాయి. ఇందులో రూ.2,000 కోట్ల వరకు ఎల్‌ఐసి పెట్టుబడి పెట్టనుందని అంచనా. ప్రస్తుతం ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని సమాచారం.

➡️