మార్కెట్లకు ఆఖర్లో నష్టాలు

Mar 10,2025 21:04 #Big loss, #Business, #market, #sensex
  • సెన్సెక్స్‌ 217 పాయింట్ల పతనం

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటాయి. సెన్సెక్స్‌ 74,475 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ.. ఓ దశలో 407 పాయింట్లు పెరిగి 74,741 గరిష్టానికి చేరింది. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి చోటు చేసుకోవడంతో 217 పాయింట్లు కోల్పోయి 74,115కు పడిపోయింది. ఓ దశలో 74,022 కనిష్టాన్ని చవి చూసింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 92 పాయింట్లు తగ్గి 22,460 వద్ద ముగిసింది. ఇండుస్‌ఇండ్‌ బ్యాంక్‌, జొమాటో, లర్సన్‌ అండ్‌ టర్బో, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. మరోవైపు పవర్‌ గ్రిడ్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ఇన్ఫోసిస్‌, నెస్ల్టే ఇండియా, ఐటిసి షేర్లు అధికంగా లాభపడిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.5 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 2.1 శాతం చొప్పున నష్టపోయాయి. ఎఫ్‌ఎంసిజి మినహా మిగతా అన్ని రంగాల సూచీలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. ఆటో, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌, మెటల్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఆయిల్‌, గ్యాస్‌, రియాల్టీ, పిఎస్‌యు బ్యాంక్‌ సూచీలు రెండు శాతం వరకు నష్టాపోయాయి. మార్చిలో ఇప్పటి వరకు రూ.15,502 కోట్ల విలువ చేసే ఈక్విటీలను విదేశీ సంస్థాగత మదుపర్లు తరలించుకుపోయారు.

➡️