మార్కెట్లకు నష్టాలు..

May 15,2024 20:38 #Business, #Stock Markets

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్ల మూడు రోజుల వరుస లాభాలకు తెర పడింది. బుధవారం బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 118 పాయింట్ల నష్టంతో 72,987కు తగ్గింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 17 పాయింట్లు తగ్గి 22,201 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 73,301.47 – 73,301.47 వద్ద కదలాడింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, టాటా మోటార్స్‌, రిలయన్స్‌ షేర్ల పతనంతో మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మరోవైపు కోల్‌ ఇండియా, సిప్లా, బిపిసిఎల్‌, భారతి ఎయిర్‌టెల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్‌టిపిసి, ఎంఅండ్‌ఎం సూచీలు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరసలో ఉన్నాయి.

➡️