న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకి కూడా ధరల పెంపును ప్రకటించింది. ఇప్పటికే ఆడి, హ్యుందారు మోటార్ కంపెనీలు ధరలు పెంచాలని నిర్ణయించగా.. తాజాగా మారుతి సుజుకి అదే బాటలో నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాది జనవరి ఒక్కటో తేది నుంచి తమ కార్ల ధరలను నాలుగు శాతం పెంచుతున్నట్లు శుక్రవారం వెల్లడించింది. కార్ల తయారీ ఖర్చులు పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మారుతి సుజుకి పేర్కొంది. ఇప్పటికే హ్యుందారు మోటార్స్ తమ వాహన ధరలను రూ.25 వేల వరకు పెంచుతున్నట్లు తెలిపింది.