న్యూఢిల్లీ : దిగ్గజ వాహన రంగ కంపెనీ మారుతి సుజుకి విద్యుత్ వాహన రంగంలోని విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ‘ఇ ఫర్ మీ’ విజన్‌ను ఎంచుకున్నట్లు వెల్లడించింది.
ఇందులో భాగంగా తొలి ఎస్‌యువి ఎలక్ట్రిక్ వాహనం ఇ విటారాను ఆవిష్కరించనున్నట్లు తెలి పింది. ఈ వాహనాన్ని త్వరలో న్యూఢిల్లీలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించనున్నట్లు పేర్కొంది. ఇ ఫర్ మీలో భాగంగా ఇవిలో మౌలిక వసతు లకు కూడా మద్దతును అందించనున్నట్లు పేర్కొంది.