భారత్‌లో మస్సే ఫెర్గూసన్‌ బ్రాండ్‌ మాదే..

Oct 2,2024 21:44 #Business, #Massey Ferguson
  • అగ్కొకు వ్యతిరేకంగా టఫె దిక్కార ఫిటిషన్‌

చెన్నయ్ : అమెరికాకు చెందిన అగ్కొ కార్పొరేషన్‌ చెన్నయ్ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందున ఆ సంస్థపై దిక్కార పిటీషన్‌ దాఖలు చేసినట్లు ట్రాక్టర్స్‌ అండ్‌ ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ లిమిటెడ్‌ (టఫె) తెలిపింది. టఫే మాస్సే పెర్గూసన్‌ బ్రాండ్‌పై తమకే హక్కులు ఉన్నాయని ఇందులో పేర్కొంది. అగ్కొలో 2012లో కీలక వాటాను సొంతం చేసుకుని దాని ఏకైక పెద్ద వాటాదారుగా, దీర్ఘకాలిక పెట్టుబడిదారిగా మారినట్లు పేర్కొంది. 65 ఏళ్ల మాస్సే బలమైన ఆర్‌అండ్‌డి, 500 మోడల్స్‌ వాహనాలను కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఏడాదికి 1,80,000 ట్రాక్టర్లను తయారు చేస్తే.. అందులో 1 లక్ష మాస్సే ఫెర్గూసన్‌ ఉత్పత్తి చేస్తుందని.. 30 లక్షల మంది సంతృప్తికర ఖాతాదారులు తమకున్నట్లు తెలిపింది. 80 దేశాలకు ఎగుమతులను కలిగి ఉన్న టఫె, మాస్సేను వేరువేరుగా చూడలేమని పేర్కొంది.

➡️