ఫిలిప్స్‌తో మెడ్‌ట్రానిక్స్‌ భాగస్వామ్యం

గుర్గావ్‌ : వైద్య సాంకేతికతలో అగ్రగామి అయిన మెడ్‌ట్రానిక్‌ తాజాగా ఆరోగ్య సాంకేతికత సంస్థ ఫిలిప్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్ట్రక్చరల్‌ హార్ట్‌ డిసీజెస్‌ కోసం అధునాతన ఇమేజింగ్‌ టెక్నిక్‌లపై కార్డియాలజిస్టులు, రేడియాలజిస్టులకు అవగాహన కల్పించడానికి, శిక్షణ ఇవ్వడానికి ఒప్పందంపై సంతకం చేసినట్లు ఇరు సంస్థలు ప్రకటించాయి. ముఖ్యంగా ఎండ్‌-స్టేజ్‌ రీనల్‌ డిసీజ్‌ (ఇఎస్‌ఆర్‌డి) రోగులకు సేవలందించడంలో ఎకోకార్డియోగ్రఫీ (ఎకో), మాగెటిక్‌ రెసొనెన్స్‌ ఇమేజింగ్‌ (ఎంఆర్‌ఐ) వంటి మల్టీ మోడాలిటీ ఇమేజింగ్‌లో 300 మందికి పైగా వైద్యుల నైపుణ్యాన్ని పెంచడాన్ని ఈ భాగస్వామ్యం లక్ష్యమని మెడ్‌ట్రానిక్‌ ఇండియా ఎండి మన్దీప్‌ సింగ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

➡️