- రెండు జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం
ప్రజాశక్తి -హైదరాబాద్ : మహారాష్ట్రలో 21 వేల కోట్ల పెట్టుబడితో 4,000 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన రెండు భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) ఒప్పందం కుదర్చుకుంది. ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో గురువారం జరిగిన ఒప్పంద కార్యక్రమంలో అక్కడి జల వనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి దీపక్ కపూర్, మేఘా సంస్థ తరపున కంపెనీ ప్రెసిడెంట్ ఆర్‌విఆర్ కిషోర్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ నీటి వినియోగం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అన్నారు. కామోడ్ వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌ను ఐదేళ్ళలో, ఘోస్లా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌ను మూడున్నరేళ్లలో అందుబాటులోకి తేనున్నామన్నారు.