న్యూఢిల్లీ : మీరే అసెట్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా మీరే అసెట్ స్మాల్ క్యాప్ ఫండ్‌ను ఆవిష్కరించినట్లు తెలిపింది. ఈ ఒపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్‌లోని నిధులను స్మాల్ క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్స్‌ల్లో పెట్టుబడిగా పెట్టనుంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ పై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు.. దీనికి తమ ఈక్విటీ సీనియర్ ఫండ్ మేనేజర్ వరుణ్ గోయల్ నేతృత్వం వహించనున్నారని తెలిపింది. జనవరి 10న సబ్‌స్క్రిప్షన్‌కు తెరువబడిందని.. 24న మూసివేయబడుతుందని పేర్కొంది. తిరిగి ఫిబ్రవరి 3న క్రయ, విక్రయాల కోసం తెరుబడుతుందని తెలిపింది. కనీస పెట్టుబడిని రూ.5000గా నిర్ణయించింది.