ఎయిరిండియాలో ఎఐఎక్స్‌ కనెక్ట్‌ విలీనం పూర్తి

Oct 1,2024 21:08 #air india express, #Business

న్యూఢిల్లీ : టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థలైన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఎఐఎక్స్‌ కనెక్ట్‌ (గతంలో ఎయిరేషియా ఇండియా) విలీన ప్రక్రియ పూర్తయ్యింది. విలీనానికి కావాల్సిన నియంత్రణపరమైన ఆమోదం తెలిపినట్లు మంగళవారం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) ప్రకటించింది. దీంతో అక్టోబర్‌ 1 నుంచి ఏఐఎక్స్‌ కనెక్ట్‌ కింద నమోదైన విమానాలన్నీ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ పేరుతో నడవనున్నాయి.

➡️