భారీ విస్తరణపై ఎంజి మోటార్‌ దృష్టి

Apr 17,2024 21:09 #Business, #MG Motor tie up

న్యూఢిల్లీ : తృతీయ, నాలుగో శ్రేణీ నగరాలపై కీలక దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఎంజి మోటార్‌ ఇండియా తెలిపింది. 2025 మార్చి నాటికి 270 నగరాల్లో 520 టచ్‌పాయింట్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ముగింపు నాటికి కొత్తగా 100 టచ్‌ పాయింట్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించుకున్నామని ఎంజి మోటార్‌ ఇండియా చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ సతిందర్‌ సింగ్‌ బజ్వా తెలిపారు. ప్రతీ డీలర్‌షిప్‌లోనూ తమ అన్ని కొత్త మోడళ్లు ఉండేలా చూస్తామన్నారు. తమ తదుపరి జర్నీ ఎంజి 2.0 పట్ల చాలా ఆసక్తిగా ఉన్నామన్నారు. ప్రస్తుతం ఏడాదికి లక్ష యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నామని.. దీన్ని 3 లక్షలకు చేర్చాలని నిర్దేశించుకున్నామన్నారు. ఎంజి మోటార్‌ ఇటీవలే జెఎస్‌డబ్లును సంయుక్త భాగస్వామిగా ఎంచుకుంది.

➡️